Pages

Subscribe:

Monday, January 9, 2012

మన తెలుగు

"తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను,
తెలుగు వల్లభుండ తెలుగొకండ,
ఎల్లనృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స!"
-ఆముక్తమాల్యద-శ్రీకృష్ణదేవరాయలు


  "ప్రాంతాలలో  మిన్న అయినది తెలుగు ప్రాంతం, నేను తెలుగు రాజును. తెలుగుభాషను సకల జనులూ కొలుచుచుందురు. అటువంటి తెలుగు, దేశ భాషలన్నింటిలో తియ్యనైనది, గొప్పది" 
అని ఆముక్తమాల్యద గ్రంధం లో  శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు.
 






"ఆంధ్రత్వ మాంధ్రభాషాచ నాల్పస్య తపసః ఫలం"
 - అవచితిప్పయ
ఆంధ్రత్వమంటే  తెలుగుతనం, ఆంధ్రభాష అంటే తెలుగు భాష వీటిని పొందటం కేవలం కొద్దిదైన తపస్సుతో సాధ్యపడేది కాదు. ఎన్నో యుగాల తపస్సు ఫలితమే తెలుగు భాషని మాతృ భాషగా పొందగలగడం. ఈ విధంగా మన  తెలుగుభాష  గొప్పదనాన్ని కీర్తించింది స్వతహాగా స్వభాషాభిమానం ఎక్కువగా ఉండే తమిళభాషా కవి.
వారి పేరు అవచితిప్పయ.


ఇటువంటి తెలుగుని మాతృభాషగా పొందడం మన పూర్వజన్మ సుకృతం.